పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ రెడీ అవుతోంది. అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘‘హరిహర వీరమల్లు’’ సినిమా ట్రైలర్‌కు సంబంధించిన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, జులై 3వ తేదీన థియేటర్లలోనే ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. పవన్ కల్యాణ్ చారిత్రక యోధుడిగా కనిపించబోతున్న ఈ సినిమాపై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే జూలై 24న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
క్రిష్, జ్యోతికృష్ణ కలసి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి ఏఎం రత్నం నిర్మాతగా ఉన్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ కావడంతో ఫ్యాన్స్‌లో హైప్ మరింత పెరిగింది. జులై 3న థియేటర్‌లో ట్రైలర్ చూశాక, జూలై 24న పవన్ యాక్షన్ ఎలా ఉండబోతుందో చూడటం కోసం ఇంకా ఎక్కువ మంది థియేటర్లకు పరుగులు పెట్టడం ఖాయం. మరి పవర్ స్టార్ మాజిక్ మరోసారి ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. అయితే ట్రైలర్ రిలీజ్ కి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు.