టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నికీషా పటేల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఊహించిన విధంగా సక్సెస్ కాకపోయినప్పటికీ హీరోయిన్ గా నటించిన నికీషా పటేల్ కు మాత్రం మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా తరువాత ఈమెకు సరైన అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తరువాత ఈమె మలయాళ,తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కానీ అక్కడ కూడా ఊహించిన విధంగా సక్సెస్ కాకపోవడంతో ఈమె విదేశాలకు వెళ్లిపోయింది. అయితే సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు చేరువగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన విషయాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి విషయాన్ని బయటపెట్టి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఒక విదేశీయుడు తో ప్రేమలో ఉన్న ఆమె త్వరలోనే అతని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
ఆ వార్త నిజం అన్నట్టు గతంలో చిన్న హింట్ ఇవ్వడంతో అభిమానులు ఆమె కాబోయే భర్తను చూపించాలి అంటూ కామెంట్స్ పెట్టడంతో ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది నికీషా పటేల్. తన ప్రియుడి ఫోటోను సోషల్ మీడియా వేదిక పంచుకుంది. దీంతో కొందరు ఆమెకు విషెస్ చెబుతుండగా మరి కొందరు పెళ్లి ఎప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీపావళి పండుగ సందర్భంగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ప్రియుడి ఫోటోని షేర్ చేసి వెంటనే ఆ తర్వాత సాయంత్రానికి ఆ ఫోటోని ఇంస్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసింది. దీంతో అభిమానులు అతడు ఫ్రెండా లేకపోతే బాయ్ ఫ్రెండా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై నికిషా పటేల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.