ఫ్యాన్స్ ని ఊపేస్తున్న “ఓజి” పై అదిరే అప్డేట్..!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు రెండు భారీ చిత్రాలు “ఉస్తాద్ భగత్ సింగ్” అలాగే “ఓజి” సినిమాలు చేస్తున్న సంగతి ఉన్న సంగతి తెల్సిందే. కాగా ఈ చిత్రాలతో పాటుగా పవన్ రాజకీయాల్లో కూడా సాలిడ్ హై ను పవన్ ఫ్యాన్స్ కి అందిస్తున్నాడు.

అలాగే సినిమా పాలిటిక్స్ మధ్యలో వచ్చిన గ్యాప్ లో అయితే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కంటిన్యూ చేయగా ఈ సినిమా తర్వాత ఓజి లో పవన్ జాయిన్ కానున్నారు అని టాక్ వచ్చింది. మతి ఇప్పుడు అనుకున్నట్టుగానే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ అనంతరం ఇప్పుడు ఓజి షూటింగ్ కి సిద్ధం అయినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

వీటితో పాటుగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై సినిమా డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న రవిచంద్రన్ సహా సంగీత దర్శకుడు థమన్ నుంచి వస్తున్నట్టుగా తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ లో థమన్ కొట్టిన బీట్స్ ఇంకా సోషల్ మీడియాలో మూవీ లవర్స్ లో రూల్ చేస్తున్నాయి.

దీనితో మళ్ళీ మ్యూజికల్ అప్డేట్ ఏమన్నా అందిస్తున్నారా అనేది ఆసక్తిగా మారింది. ఇక ఇంకో ఎగ్జైటింగ్ వార్త ఏమిటంటే ఈ చిత్రంలో ఇప్పుడు మేకర్స్ అదిరిపోయే ఎంట్రీ సీన్ ని పవన్ పై చేస్తున్నారని తెలుస్తుంది. ఈ షూట్ కి ఇప్పుడు కాకినాడలో అయితే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ మేకర్స్ అక్కడ ల్యాండ్ అవ్వగా నెక్స్ట్ పవన్ పై ఈ సీన్స్ తెరకెక్కిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఓజి ఈ లేటెస్ట్ అప్డేట్స్ పట్ల ఫ్యాన్స్ మంచి ఎగ్జైటింగ్ గా ఉన్నారు.