వద్దు బాబోయ్ ఇక చాలంటోన్న పవన్.!

పవన్ కళ్యాణ్‌కి ఓ పక్క సినిమాలూ, మరోపక్క రాజకీయాలు.. అస్సలు టైమ్ లేదు. ఈ తరుణంలో ఆయన ఒప్పుకున్న సినిమాలన్నీ చకచకా పూర్తి చేసేస్తున్న సంగతి తెలిసిందే.

వీలైనంత త్వరగా పూర్తి చేసేసి రాజకీయాల్లో బిజీ అయిపోవాలనుకుంటున్నారట పవన్ కళ్యాణ్. అయితే, పవన్‌ని సెట్స్‌లో కలవడానికి వస్తున్న కొందరు దర్శకులు కథలతో ఆయనను కలుస్తున్నారట. ఎలాగైనా ఆయనతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారట.

ఒకవేళ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆయన తర్వాత సినిమాలు చేసే అవకాశాలు చాలా తక్కువ. అందుకే ఈ లోపే వీలైనంత తక్కువ టైమ్‌లోనే ఆయనతో సినిమా చేసేసి తమ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారట కొందరు దర్శకులు.

ఇంకొందరు దర్శకులైతే నిర్మాతల్ని సైతం వెంట పెట్టుకొస్తున్నారట. కనీసం 10 రోజుల డేట్స్ ఇచ్చినా సరే, సినిమా పూర్తి చేసేసుకుంటామని హామీ ఇస్తున్నారట. స్వతహాగా మొహమాటస్తుడైన పవన్ కళ్యాణ్ వారిని వారించలేకపోతున్నారట.