తమ్ముడు తప్పించుకున్నాడు.! అన్నయ్య దొరికిపోయాడు.!

తమిళ దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా గతంలో ఓకే చేసి పెట్టారు. ఆ సినిమానే ‘వేదాళం’ రీమేక్. అదేనండీ.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘భోళా శంకర్’ సినిమానే అది.

ఎప్పుడు.? ఎలా.? చేతులు మారిందో తెలీదు కానీ, ఆ ప్రాజెక్ట్ నుంచి పవన్ తప్పుకున్నాడు. నెల్సన్ చేతిలోంచి, ఆ ప్రాజెక్ట్ మెహర్ రమేష్ చేతికొచ్చింది.

అనుకోకుండా ఆ ప్రాజెక్ట్‌లోకి మెగాస్టార్ చిరంజీవి వచ్చి చేరారు. అంతా బాగానే వుంది. సినిమా చాలా బాగా వచ్చింది. సూపర్ హిట్ ఖాయం అని నమ్మకంగా ప్రమోషన్లు చేసింది చిత్ర యూనిట్.

తీరా సినిమా రిలీజయ్యాకా, ఎక్కడ లేని నెగిటివిటీ.. సహజంగానే మెగా కాంపౌండ్ సినిమాలను ఈ మధ్య నెగిటివిటీ వెంటాడుతోందిలే అని తీసి పడేద్దామా.? అంటే ఈ ప్రాజెక్ట్‌లో తెలీకుండానే తప్పులు దొర్లేశాయ్.. అంటున్నారు సినీ మేథావులు.

అసలే ‘ఆచార్య’ ఫెయిల్యూర్ చిరంజీవిని వెంటాడుతూనే వుంది. మధ్యలో ‘వాల్తేర్ వీరయ్య’ లాంటి హిట్టు పడ్డా కూడా ‘ఆచార్య’ ఇంపాక్ట్ వదలడం లేదు. ఈ టైమ్‌లో ‘భోళా శంకర్’ దారుణమైన దెబ్బ.!