Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సీనియర్ డైరెక్టర్‌తో చెయ్యడానికి ఇష్టపడడు…. కారణం అదే డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan: పవన్ కల్యాణే తన దగ్గరికి వచ్చాడని, నువ్వంటే ఇష్టమని చెప్పేవాడని డైరెక్టర్‌ గీతా కృష్ణ అన్నారు. ఆయనతో సినిమా తీయాలనే భావన తనలో ఉంది కానీ, ఆయన యాక్టర్ అయ్యాక అతని బాడీ లాంగ్వేజ్ చూస్తే తనకు ఏం అర్థమైందంటే, అతనికి కొత్త వాళ్లతోటి చేస్తే, అంటే సీనియర్ డైరెక్టర్‌లతో అంత కంఫర్టబుల్‌గా ఫీలవరేమోనని తన అభిప్రాయం వెలిబుచ్చారు గీతా కృష్ణ.

ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ పాత డైరెక్టర్‌లతో కలిసి చేయలేదని, ప్రారంభంలో ఈవీవీతో చేశారు గానీ ఆ సినిమా ఫ్లాప్ అయిందని ఆయన చెప్పారు. ఓ సారి తాను సింగపూర్ వెళ్తున్నపుడు పవన్ కల్యాణ్ కూడా కలిశారని, ఆ సందర్భంలో ఆ విషయంపై ఆయన దాని గురించి మాట్లాడారని కూడా ఆయన అన్నారు. ఇకపోతే ఆయన ముత్యాల సుబ్బయ్యతో తీసిన గోకులంలో సీత ఒక్కటి హిట్ కొట్టింది గానీ ఆ తర్వాత ఏం లేదని ఆయన చెప్పారు.

తనకు తెలిసినంతవరకు ముత్యాల సుబ్బయ అనే వ్యక్తి చాలా మంచివారని, ఎలాంటి కాంట్రవర్షియల్ మ్యాటర్స్‌లో తలదూర్చరని గీతా కృష్ణ అన్నారు. ఆయన అంత మంచోడు కాబట్టే చేశారేమో, లేదంటే తాము అంత మంచోళ్లం కాదు కదా అని సెటైరికల్ కామెంట్స్‌తో బదులిచ్చారు గీతా కృష్ణ.