Pawan Kalyan: ఆ ప్రాంతంలో ఖరీదైన స్థలం కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్… ధర ఎంతంటే?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రాజకీయాల తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఈయనకు మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఒక్కో సినిమాకి పవన్ కళ్యాణ్ ఏకంగా 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఈ విధంగా సినిమాలతోపాటు రెమ్యునరేషన్ పెంచేసిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని ఓ ప్రాంతంలో ఖరీదైన స్థలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాదులో స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే మంచి ఖరీదైన ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఏకంగా 12 వందల గజాల స్థలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన ఏరియాలో ఒక్క గజం ధర సుమారు రెండు లక్షల వరకు ఉన్నట్లు సమాచారం.

ఈ లెక్కన చూస్తే పవన్ కళ్యాణ్ 1200 గజాలకు ఏకంగా 20 కోట్ల రూపాయల ఖరీదైన స్థలం కొనుగోలు చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ 20 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఖాజా గూడా ఏరియాలో ఓ ప్రముఖ పాఠశాల ఎదురుగా ఉన్న ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇలా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ పవన్ కళ్యాణ్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆస్తులను పోగు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక తాజాగా ఆయన నటించిన భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్దమంచి కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే ఇక ఈ సినిమాని త్వరలోనే హిందీలో కూడా రిలీజ్ చేయడం కోసం సన్నాహాలు చేస్తున్నారు.