పవన్ కళ్యాణ్ అప్పుచేసి పొలం కొన్నారు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగబాబు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి కష్టం వచ్చిన మూకుమ్మడిగా ఒక్కటై ఒకరికొకరు ఎంతో సహాయం చేసుకుంటూ ఎంతో మంది అన్నదమ్ములకు ఆదర్శంగా ఉంటారు.ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఈయనకు అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇకపోతే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆస్తుల గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలోనే ఈ వార్తలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆస్తుల గురించి నాగబాబు మాట్లాడుతూ మాకు తాతలు సంపాదించి పెట్టిన వేలకోట్ల ఆస్తులు ఏవీ లేవు. మేం కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు మాకు మిగిలాయని తెలిపారు. ఇక కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన అందరి హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అయితే సినిమా ఇండస్ట్రీలో తాను సంపాదించిన డబ్బు మొత్తం రాజకీయాలలో ప్రజాసేవ కోసమే ఉపయోగిస్తున్నారని తెలిపారు.

ఇలా ప్రజాసేవ కోసం కళ్యాణ్ ఏ మాత్రం డబ్బు కూడా పెట్టుకోకుండా ప్రజల కోసం ఉపయోగిస్తున్నారని ఇకపోతే శంకర్ పల్లిలో వ్యవసాయం కోసం 8 ఎకరాల పొలం తీసుకున్నారు. అదికూడా ఫైనాన్స్ లో తీసుకొని ప్రతి నెల ఈఎంఐ కడుతున్నారని ఈ సందర్భంగా నాగబాబు పవన్ కళ్యాణ్ ఆస్తుల గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.