పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈయన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ గత 20 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ఉన్నారు. ఇకపోతే ఈయన రెమ్యూనరేషన్ కూడా కోట్లలో ఉంటుందనే విషయం మనకు తెలిసిందే.ఇలా కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ మరోవైపు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు భారీగా ఆస్తిపాస్తులను సంపాదించి ఉంటారని అందరు భావిస్తారు.
నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సంపాదన కన్నా ఆయన ఖర్చులే అధికంగా ఉన్నాయి. ఈయన జనసేన పార్టీ కోసం పూర్తిగా తన సొంత డబ్బులను ఖర్చు చేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.ఈ క్రమంలోనే సినిమాలలో సంపాదించినది మొత్తం పార్టీ కోసం ఖర్చు చేయడం వల్ల ఈయన పెద్దగా ఆస్తులను పోగు చేయలేదని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ తనకు అవసరమైన వాటిని కొనుగోలు చేస్తూ ఎంతో సాదా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఖరీదైన విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయడమే కాకుండా జూబ్లీహిల్స్ లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ కు ఎంతో ఇష్టమైన స్థలం తన ఫామ్ హౌస్. పాతిక ఎకరాల ఫామ్ హౌస్ ఇలా పవన్ కళ్యాణ్ ఆస్తులు అన్ని కలిపి కేవలం 160 కోట్ల రూపాయలు మాత్రమే అని తెలుస్తుంది.ఇక ఈయన ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ డబ్బులు మొత్తం తన పార్టీ కోసం ఖర్చు చేయడం లేదా తన సినిమాల వల్ల ఎవరైనా నష్టపోతే తాను తీసుకున్న రెమ్యూనరేషన్ వారి నష్టాలను పూడ్చడానికి ఇస్తారని అందుకోసమే ఈయన పెద్దగా ఆస్తులను పోగు చేయలేదని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ డబ్బులు సంపాదించడం కోసమే ఇండస్ట్రీలోకి కనుక వచ్చి ఉంటే ఈయన ఈపాటికి వేల కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించే వారని అయితే తాను డబ్బు కోసం ఇండస్ట్రీలోకి రాలేదని చెప్పకనే చెబుతున్నారు.