పవన్ కల్యాణ్, శ్రీలీల.. ఓ మాస్ స్టెప్!

శ్రీలీల.. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా కుర్రకారు హాట్ ఫేవరెట్ అయిన ఈ క్యూట్ బ్యూటీ ప్రస్తుతం స్టార్ హీరోలతో కలిసి పని చేస్తోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, పవన్ కల్యాణ్ వంటి వారి సరసన సందడి చేస్తుంది. వరుస హిట్లతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది.

తన అందం, అభినయం, డ్యాన్స్ తో కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. ఇటీవల ఆమె చేసిన అన్ని సాంగ్స్ లలో డ్యాన్స్ లకు విపరీతమైన వ్యూస్ వచ్చాయి. తన గ్లామర్ డోస్‌తో పాటు, అందంగా స్టెప్పులు వేస్తూ.. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటోంది. ముఖ్యంగా సూపర్ హిట్ చిత్రం ధమాకాలో ఆమె చేసిన డ్యాన్స్‌లకు విశేష స్పందన లభించింది.

జింతక్, పల్సర్ బైక్ మరియు దండకడియాల్ వంటి పాటల్లో ఆమె డ్యాన్స్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఎక్కడ చూసిన ఈ పాటులు, ఆమె డ్యాన్సులే దర్శనం ఇస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలీల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం నుంచి సినిమా చిత్రీకరణలో పాల్గొంటుంది.

అయితే ఇటీవలే ట్విట్టర్ వేధికగా ఓ నెటిజెన్.. హరీష్ శంకర్‌ని ట్యాగ్ చేస్తూఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఓ మాస్ సాంగ్ పెట్టాలని కోరాడు. అంతేకాకుండా ఆ పాటకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పాటు అందాల భామ శ్రీలీల స్టెప్పులు వేస్తే మరింత బాగుంటుందని చెప్పాడు. ఇందుకు స్పందించిన హరీష్ శంకర్… రెండు థంప్స్ అంబ్ ఎమోజీలను యాడ్ చేసి రిప్లై ఇచ్చాడు.

స్వయంగా సినిమా డైరెక్టర్ యే హామీ ఇవ్వడంతో.. పవన్ కల్యాణ్ అభిమానులు తెగ సంబర పడుతున్నారు. మాస్ సాంగ్ లో పవన్ కల్యాణ్, ఆయన పక్కన శ్రీలీల చాలా బాగుంటుందని చెబుతున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మాస్ సాంగ్ చూసేందుకు ప్రేక్షకులంతా తెగ వేచి చూస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం సమకూరుస్తున్నాడు.