పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా వకీల్ సాబ్ సినిమా మోషన్ పోస్టర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఇక.. ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ అయిందో లేదో.. యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది.
రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ.. పవన్ తన అభిమానుల కోసం సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమా పూర్తవగానే పవన్.. క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఆ సినిమాకు సంబందించిన అప్ డేట్ ను కూడా మూవీ యూనిట్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసింది.
పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కు అప్ డేట్లే అప్ డేట్లు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్.. విరూపాక్ష అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నిజానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా… కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయింది.
ఇక.. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ సినిమా షూటింగ్ బహుశా వచ్చే సంవత్సరం ప్రారంభం కావచ్చు. అప్పటిలోగా క్రిష్ వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జోడీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తికాగానే పవన్ కల్యాణ్ తో సినిమా ఉంటుంది.
విరూపాక్ష సినిమా మొఘలుల కాలం నాటి కథతో నడిచే సినిమా. మొఘలుల కాలాన్ని క్రిష్ మరోసారి ఈతరానికి చూపించనున్నాడు. ఈసినిమాలో పవన్ కల్యాణ్ రాబిన్ హుడ్ తరహాలో ఉన్న ఓ పాత్రను చేయనున్నారట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఈ సినిమాలో తీసుకోనున్నారు. తెలుగుతో పాటుగా ఏకకాలంలో హిందీలో కూడా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
Here's the Pre-look poster of Power Star @pawankalyan garu from our #PSPK27. #HBDPawanKalyan
More details will follow soon. @DirKrish #AMRatnam @mmkeeravaani pic.twitter.com/eX6bUgVLsr
— Mega Surya Production (@MegaSuryaProd) September 2, 2020
@PawanKalyan గారు, #PSPK27 పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది..
చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది..
ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం..
ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ #HBDPawanKalyan pic.twitter.com/PCVhIO3uxm— Krish Jagarlamudi (@DirKrish) September 2, 2020