ఇన్సైడ్ టాక్ : “ఓజి” లో పవన్ రోల్ ఆమెతో కనెక్షన్ ఇదే.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఓజి” ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కోసం అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ చేస్తున్న చిత్రాల్లో పవన్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఇదే.

కాగా ఈ సినిమా లో పలువురు ఊహించని నటులు ఆన్ బోర్డు లోకి రాగ ఈ లిస్ట్ లో అయితే కోలీవుడ్ ఫేమస్ మాస్ నటి శ్రీయా రెడ్డి కూడా ఒకరు. మరి ఈమె పాత్ర సహా పవన్ రోల్ పై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇంట్రెస్టింగ్ సమాచారం తెలుస్తుంది. కాగా పవన్ కి అయితే ఈమె వదిన పాత్రలో పక్కా మాస్ అండ్ పవర్ పాత్రలో కనిపిస్తుందట.

అలాగే పవన్ పేరు కూడా ఈ సినిమాలో తెలుస్తుంది. పవన్ పెరి ఈ చిత్రంలో “గాంధీ” అట. ఇది ఎక్కడో విన్నట్టు ఉంది కదా! అయితే మొత్తానికి అయితే ఓజి నుంచి ఈ న్యూస్ పక్కా అని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా నేపథ్యం అయితే 1950ల టైం లో ఉంటుందని కూడా టాక్ ఉంది.

ఇక మరికొన్ని రోజుల్లో అయితే ఈ సినిమా షూట్ మళ్ళీ రీస్టార్ట్ కానుండగా థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఆర్ ఆర్ ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ కి రానుంది.