బండ్ల గణేష్ పై ఫైర్ అవుతున్న పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ ఫ్యాన్స్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కమెడియన్ గా తన కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ అంచలంచెలుగా ఎదుగుతూ ప్రొడ్యూసర్ గా మారి గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించాడు. అంతేకాకుండా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. మైక్ దొరికితే చాలు పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ పవన్ కళ్యాణ్ నా దేవుడు.. అతను లేకపోతే ఈరోజు నేను ఇండస్ట్రీలో ఇంత గొప్ప స్థాయికి ఎదిగే వాడిని కాదు అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తూ ఉంటాడు. అయితే గత కొంతకాలంగా బండ్ల గణేష్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.

ఇటీవల కూడా ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. “తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు ఎన్టీఆర్ , మహేష్ రామ్‌చరణ్ , ప్రభాస్ లా టాలెంట్‌ కూడా ఉండాలి బ్రదర్‌ ” అంటూ బండ్ల గణేష్ ట్వీట్‌ చేశారు. అతను విజయ్ దేవరకొండ ను ఉద్దేశించి ఇలా ట్వీట్ చేశాడని సమాచారం. ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఈ క్రమంలో బండ్ల గణేష్ విజయ్ దేవరకొండ ను ఉద్దేశించి ఇలా ట్వీట్ చేశాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ గురించి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఇండస్ట్రీలో మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ కి మాత్రమే టాలెంట్ ఉందా? పవన్ కళ్యాణ్ కి, అల్లు అర్జున్ కి టాలెంట్ లేదా అని మండిపడుతున్నారు.

పవన్ కళ్యాణ్ నా దేవుడు అని చెప్పుకుంటున్న బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పేరుని, అల్లు అర్జున్ పేరుని మెన్షన్ చేయకపోవడంతో వారి అభిమానులు సీరియస్ అవుతున్నారు. మా హీరోలకు టాలెంట్ లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ ఆల్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు పొందాడు. అయినప్పటికీ అల్లు అర్జున్ కి టాలెంట్ లేదా? అని బన్నీ అభిమానులు మండిపడుతున్నారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఇలాగే సోషల్ మీడియాలో ‘ జీవితంలో ఎవరిని నమ్మకూడదని తల్లిదండ్రులు భార్య పిల్లలు తప్ప ప్రపంచంలో మనకోసం ఆలోచించేవారు ఎవరూ లేరు ‘ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ మధ్య ఏదో జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందువల్లే ఇటీవల ట్వీట్ చేసిన పోస్టులో పవన్ కళ్యాణ్ పేరు మెన్షన్ చేయలేదని అభిప్రాయపడుతున్నారు.