నన్ను లక్షల మంది అభిమానిస్తున్నారంటే నాకే ఓసారి ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

pawan kalyan about his fans

పవన్ కల్యాణ్ .. ఆయన పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా ఆయన ఆలోచనలు ఎప్పుడూ మధ్యతరగతి దృక్పథంతోనే ఉంటాయి. ఆయనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ తన గురించి ఎక్కువగా ఊహించుకోరు. సామాన్యమైన వ్యక్తిగా ఉండటానికే పవన్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

pawan kalyan about his fans
pawan kalyan about his fans

తన బర్త్ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పవన్ .. తన గురించి ఏం చెప్పారంటే.. నా గురించి నేను పెద్దగా ఆలోచించను.. పెద్దగా పట్టించుకోను కూడా. ఎక్కువగా ఊహించుకోవడం కూడా ఉండదు. నేను సామాన్యుడిని. మధ్యతరగతి వ్యక్తిని. నెల్లూరులో ఉన్నప్పుడడు నేను ఎలా మధ్యతరగతి వ్యక్తిగా జీవించానో.. ఇప్పుడూ అలాగే ఉన్నా.. అలాగే ఉంటాను.

నన్ను లక్షల కొద్ది మంది అభిమానిస్తున్నారంటేనే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంతమంది నన్న ఆదరించడం అనేది నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే.

సుస్వాగతం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓ సినిమా హాల్ లో చిన్న ఈవెంట్ ఉంది.. మీరు తప్పకుండా రావాలి అంటే నేను కర్నూలు వెళ్లా. అక్కడికి వెళ్లాక రోడ్ షో చేస్తూ వెళ్దాం అన్నారు. రోడ్ షో ఎందుకు.. డైరెక్ట్ గా వెళ్దాం అని నేను చెప్పా. మిమ్మల్ని చూడటానికి చాలామంది వచ్చారు అని అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. నన్ను చూడటానికి జనాలు వచ్చారా? నన్ను చూడటానికి ఎవరు వస్తారు.. అని ఆశ్చర్యం వ్యక్తం చేశా.

కానీ.. వాహనం ఎక్కి వెళ్తుంటే.. రోడ్డు పొడవునా… ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. వీళ్లందరు నన్ను చూడటానికి వచ్చారా? అని ఆశ్చర్యం వేసింది. అయినా వాళ్లకు నాకు పెద్దగా ఏం తేడా లేదు. వాళ్లు అటువైపు ఉన్నారు. నేనను ఇటువైపు ఉన్నా.. అనేటువంటి ఆలోచనా విధానమే నాకు ఇప్పటికీ ఉంటుంది తప్పితే.. నేనేదో ప్రత్యేకం అని నేనెప్పుడూ అనుకోను.

నేను చెప్పకున్నా కూడా నా పుట్టిన రోజు వేడుకలను నా అభిమానులు కానీ.. జనసేన కార్యకర్తలు కానీ.. చేయడం నిజంగా అది గొప్పదనం. ఒక వ్యక్తి మీద అభిమానంతో సమాజానికి ఎంతో కొంత సేవ చేస్తున్నారన్న విషయం నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది. సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడుతున్న వాళ్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.. అంటూ పవన్ తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు.

ఇక పవన్ బర్త్ డే సందర్భంగా ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా మోషన్ పోస్టర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ లో పవన్ లాయర్ కోటు వేసుకొని చేతిలో లా పుస్తకం పట్టుకొని నిలబడే తీరును చూసి పవన్ అభిమానుల సంతోషానికి అవధులు లేవు.