పవన్ సినిమాపై మోజు పడ్డ మెగా హీరో.. మనసులో ఉన్న కోరికను ఇలా బయట పెట్టేసాడుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.మెగాస్టార్ చిరంజీవి అండతో ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారి సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలలో వైష్ణవ్ తేజ్ ఒకరు.ఈయన ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన వైష్ణవ్ అనంతరం కొండ పొలం సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.

ఇకపోతే తాజాగా తన మూడవ సినిమాని గిరీషయ్య దర్శకత్వంలో నటించిన రంగ రంగ వైభవంగా అనే సినిమాని నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా కూడా మిశ్రమ ఫలితాలను సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న మెగా హీరోకి తన మామయ్యల సినిమాల గురించి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. మెగాస్టార్ చిరంజీవి,పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో రీమేక్ చేయాల్సి వస్తే మీరు ఏ సినిమాని రీమేక్ చేస్తారని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు వైష్ణవ్ సమాధానం చెబుతూ..వారు నటించిన సినిమాలన్నీ సూపర్ క్లాసిక్ సినిమాలు ఆ సినిమాలలో వారిని తప్ప ఎవరిని ఊహించుకోలేము అంటూ ఈయన సమాధానం చెప్పారు.ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో చేయాల్సి వస్తే తాను పవన్ కళ్యాణ్ మామయ్య నటించిన బద్రి సినిమా రీమేక్ చేస్తానని ఆ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా వైష్ణవ్ తన మనసులో ఉన్న కోరికను ఈ విధంగా బయటపెట్టారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఊర్రూతలూగిస్తాయని చెప్పాలి.