గాసిప్స్ : సుజీత్ ప్రాజెక్ట్ కి పవన్ ఫ్యాన్స్ డిమాండ్ చెల్లదా.?

లేటెస్ట్ గా టాలీవుడ్ లో భారీ అంచనాలు రేపిన లేటెస్ట్ సెన్సేషనల్ అనౌన్సమెంట్ ఏదన్నా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ దర్శకుడు సుజీత్ ల కాంబినేషన్ కోసమే అని చెప్పాలి. ఈ భారీ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ తోనే టాలీవుడ్ లో భారీ అంచనాలు రేపగా అనేక అంశాలు కూడా ఇందులో మంచి సస్పెన్స్ గా నిలిచాయి.

ఇక ఇదిలా ఉండగా ఈ  సినిమా విషయంలో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ అయితే సౌత్ టాప్ సంగీత దర్శకుడు అనిరుద్ ని సంగీత దర్శకునిగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు.

కానీ అసలు విషయం ఏమిటంటే ఈ డిమాండ్ అసలు సుజీత్ దగ్గర చెల్లదని తెలుస్తుంది. సినిమా అనౌన్సమెంట్ రోజునే సంగీత దర్శకుడు అనిరుద్ అయితే కాదని పవన్ సన్నిహిత వర్గాలు చెప్పేసాయి. కానీ ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చెయ్యడం వల్ల మారేది ఏది ఉండదు.

అయితే సుజీత్ తో సాహో సినిమాకి వర్క్ చేసిన జిబ్రాన్ పేరు అయితే ఇప్పుడు వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. ఇక ఈ భారీ సినిమాని అయితే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించనున్నారు.