మరోసారి పవన్ నోట తన పారితోషకం మాట.!

టాలీవుడ్ సినిమా దగ్గర ఎనలేని క్రేజ్ అంటే మొట్ట మొదట గుర్తుకొచ్చే హీరో పేరు పవన్ కళ్యాణ్. తన భారీ క్రేజ్ తో టాలీవుడ్ లో గాడ్ ఆఫ్ మాసెస్ గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మన టాలీవుడ్ లో హైయెస్ట్ డిమాండ్ ఉన్న హీరోల్లో ఒకరు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.

అయితే పవన్ ఇప్పుడు పాలిటిక్స్ కూడా చేస్తుండడంతో ఆల్ మోస్ట్ తన సినీ జీవితం కూడా బహిర్గతంగానే ఉంది. ఏ స్టార్ హీరో కూడా ఇవ్వని స్టేట్మెంట్స్ పవన్ ఇపుడు ఇస్తున్నాడు. కొన్న కితమే తాను రోజుకి రెండు కోట్ల పారితోషకం తీసుకుంటున్నానని ఓపెన్ చెప్పి షాకిచ్చారు.

ఇక దీని తర్వాత సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు పవన్ ని దుయ్యబట్టడం పవన్ అభిమానులు వాటికి కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఇదంతా బాగానే ఉండగా మరోసారి అయితే పవన్ నోట తన పారితోషకం మాట రావడం వైరల్ గా మారింది.

తాను ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గరే భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకడిని అని పవన్ అయితే తనని ప్రొజెక్ట్ చేసుకున్నారు. నిన్న జరిగిన పొలిటికల్ మీటింగ్ లో అయితే పవన్ ఈ స్టేట్మెంట్ చేయడం వైరల్ గా మారింది. తనకి విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉందని అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నా కూడా జనం కోసం ఏదోకటి చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని పవన్ తెలిపాడు.

సినిమాల్లో సమస్యలు త్వరగా పరిష్కారం అయిపోతాయి కానీ నిజ జీవితంలో అలా కాదు అందుకే నిజ జీవితంలో ప్రజలకి అండగా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చాను ఇప్పుడు సినిమాలు తన కోసం కాదు జనం కోసమే చేస్తున్నాని పవన్ చెప్పడం ఇపుడు వైరల్ గా మారింది.