ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్. దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలలో ఈ షో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుంది. తెలుగులో నాలుగో సీజన్ జరుపుకుంటుండగా, డిసెంబర్ 20తో ఈ కార్యక్రమానికి ముగింపు కార్డ్ వేయనున్నట్టు సమాచారం. నాగార్జున హోస్ట్‌గా రూపొందిన ఈ షో బుల్లితెర ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని అందిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ షో వినోదమే కాదు ప్రాణదానం కూడా చేసినట్టైంది.
వివరాలలోకి వెళితే పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామానికి చెందిన 33 ఏళ్ల బత్తుల వరప్రసాద్ బెంగళూరులో స్టాఫ్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. తలలో ట్యూమర్ ఏర్పడి ఫిట్స్ రావడంతో 2016లో ఆపరేషన్, రేడియో థెరపీ చేయించుకున్నాడు. అయిన బ్రెయిన్‌లో మరలా గడ్డ ఏర్పడి తరచు ఫిట్స్ రావడం ప్రారంభించింది. దీంతో గుంటూరు 6న గుంటూరు కొత్తపేటలోని బ్రింద న్యూరోసెంటర్ కు చికిత్స కోసం వెళ్ళాడు. పరీక్ష చేసిన వైద్యులు పెద్ద రక్తనాళ్ళం పక్కన ట్యూమర్ గుర్తించారు. 10న త్రీడీ టెక్నాలజీ ద్వారా ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ సమయంలో రోగికి బిగ్ బాస్ షో చూపిస్తుండగా, నాగార్జున పాటలు పాడుతూ ఉన్నారు. అనంతరం అవతార్ సినిమాని చూపిస్తూ, ఆయనతో మాట్లాడుతూ ఆపరేషన్ చేశాం అన్నారు వైద్యులు
ఆపరేషన్ చేసే సమయంలో రోగి మెడ వెనుక ఏదో జరుగుతుందని చెప్పాడు. దీంతో వేరే డైరెక్షన్‌లో బ్రెయిన్ నుండి ట్యూమర్‌ని బయటకు తీసి రోగి ప్రాణాలు కాపాడారట. గంటన్నర పాటు జరిగిన ఈ శస్త్ర చికిత్సలో పలు వైద్యు నిపుణులు పాల్గొన్నారు. ఏపీలో తొలిసారి అవేక్ బ్రెయిన్ సర్జరీ ఇదే నంటూ వైద్య బృందం తెలిపింది.ఏదేమైన మనిషి ప్రాణం కాపాడే క్రమంలో బిగ్ బాస్ కూడా సగభాగం అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.