హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృనాల్ ఠాగూర్ జంటగా నటించిన తాజా చిత్రం సీతారామం. ఇటీవల విడుదలైన ఈ సినిమా తెలుగు తమిళ్ భాషలలో విడుదలై ఘనవిజయం సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే డబల్ ప్రాఫిట్ ని సొంతం చేసుకొని థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సినిమా చూసిన సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా సినిమా మీద ప్రశంసల కురిపిస్తున్నారు.
ఇక తాజాగా ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరుచూరి పలుకులు పేరుతో సినిమాల గురించి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చే పరుచూరి గోపాలకృష్ణ గారు ఇటీవల సీతారామం సినిమా చూసి ఆ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రేమ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం సినిమా నాకు కూడా నచ్చింది. విభిన్న అనుభూతులను కలిగించే ప్రేమ, ఆకట్టుకునే యుద్ధ నేపథ్యం, విషాదాంతంతో కలిసిన ఈ సినిమా మరపురాని సినిమాలగా మిగిలిపోనుందని వెల్లడించాడు.
ఈ సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. గతంలో ఈ నేపథ్యంలో విడుదలైన వీర్‌జారా అనే బాలీవుడ్ సినిమా కూడా ఈ నేపథ్యంలోనే తెరకెక్కిందని గోపాలకృష్ణ గుర్తు చేశారు. సినిమా క్లైమాక్స్ లో కథ సుఖాంతానికి తావివ్వకుండా విషాదం తో ముగించటం వల్ల ఈ సినిమా ఒక భిన్నమైన ప్రేమ కథ గా నిలిచిందని పరచూరి గోపాలకృష్ణ తన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ ని కలిపి ఉంటే ఈ సినిమా మరొక లెవల్ లో ఉండేదని ఆయన వెల్లడించాడు. సీతారామం సినిమా గురించి పరచూరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.