‘పుష్ప’ కోసం పార్టీ సాంగ్.! బన్నీ అలా స్కెచ్చేశాడట.!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప ది రూలింగ్’ ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న సంగతి తెలిసిందే. కీలకమైన.. కాదు కాదు, అత్యంత కీలకమైన సీన్స్ ఈ సినిమాకి సంబంధించి షూట్ చేస్తున్నారుట.!

ఇదిలా వుంటే, ‘పుష్ప ది రూల్’ సినిమాలో ‘ఊ అంటావా మామా’ అంటూ సమంత చేసిన స్పెషల్ సాంగ్, ఆ సినిమాకే సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. ఈసారి అంతకు మించిన ‘ఇంట్రెస్టింగ్ స్పెషల్ సాంగ్’ ఒకటి డిజైన్ చేయబోతున్నారట.

మళ్ళీ సమంతే చేస్తుందా.? పూజా హెగ్దేని తీసుకొస్తారా..? బాలీవుడ్ నుంచి ఇంకెవరైనా దిగొస్తారా.? ఇలా బోల్డన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మామూలుగా వుండే ఐటమ్ సాంగ్ ఎలా వున్నా, ఓ ఇంట్రెస్టింగ్ స్పెషల్ సాంగ్ అయితే తప్పక వుండాలని అల్లు అర్జున్ పట్టుబడుతున్నాడట.

దీపికా పడుకొనే – షారుఖ్ ఖాన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓం శాంతి ఓం’ సినిమాలో స్పెషల్ సాంగ్ గుర్తుంది కదా.? బాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది అందులో కనిపిస్తారు. ఆ తరహాలో వుండబోతోందిట ఈ సాంగ్. అన్నట్టు, నాగ్ ‘కింగ్’ సినిమా కోసం ఇలాంటి ప్రయోగం గతంలోనే చేసేశారండోయ్.

నిప్పు లేకుండా కూడా పొగ పుట్టేస్తుంది.! ఇంతకీ, ‘పుష్ప 2 ది రూల్’ సినిమాలోని ఇంట్రెస్టింగ్ స్పెషల్ సాంగ్ గురించి టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస నిజమేనా.?