దేశ, విదేశాలలో సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. మనదేశంలో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా పలు ప్రాంతీయ భాషలలో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. తమిళంలో లోకనాయకుడు కమల్ హాసన్ తొలి సీజన్ నుండి ఇప్పుడు జరుగుతున్న నాలుగో సీజన్ వరకు హోస్ట్‌గా ఉన్నారు. ఆయనపై తమిళనాడు ముఖ్యమంతి ఎడప్పడి కె.పళనిస్వామి నిప్పులు చెరిగారు
జయలలిత మరణం తర్వాత కమల్ హాసన్ రాజకీయాలలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మక్కల్ నీది మయ్యమ్ అనే పార్టీని స్థాపించి వచ్చే ఏడాది జరగనున్న ఎలక్షన్స్‌లో తన క్యాండిడేట్స్‌ని రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారు కమల్. అయితే తమిళ నాడు ప్రభుత్వంపై కొద్ది రోజులుగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి కమల్‌హాసన్‌ను టార్గెట్ చేశారు. అందుకు కారణం కమల్ రీసెంట్‌గా తమిళనాడులో ఐటీ అధికారులు దాడి చేస్తుండగా, లెక్కకు అందని డబ్బు దొరుకుతుంది. ప్రభుత్వం అవినీతిని చాలా ప్రోత్సహిస్తుందని విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో పళని స్వామి.. కమల్ హాసన్‌నే కాక కమల్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోపై కూడా విమర్శలు గుప్పించాడు. ఏడు పదుల వయస్సులో కమల్ హాసన్ బిగ్ బాస్ షోని హోస్ట్ చేస్తున్నారు. ఆ షో వలన ప్రజలకు ఉపయోగం ఉందా, దాని వలన ఎవరికైన మంచి జరుగుతుందా? ఇప్పుడు ఆయన ప్రజలకు మంచి చేయకపోగా, ఆ షో ద్వారా పిల్లలని పాడు చేస్తున్నారు. బిగ్ బాస్ హోస్ట్ చేసే వ్యక్తులు చేసిన కామెంట్స్‌ని మనం పట్టించుకోనవసరం లేదు. బిగ్‌బాస్ హోస్ట్ చేయడం వల్ల కుటుంబాలు ఏమీ బాగుపడవు” అన్నారు పళనిస్వామి. మరి దీనిపై కమల్ ఏమైన స్పందిస్తారా అన్నది చూడాలి. కాగా, రజనీకాంత్ కూడా త్వరలో పార్టీ ప్రకటన చేసి ప్రచారాలలో వేగం పెంచనున్నారు