ఓటిటి : టాలీవుడ్ బెస్ట్ హారర్ థ్రిల్లర్ “మసూద” ఎప్పుడు ఎందులో అంటే.?

ప్రస్తుతం ఆ జానర్ ఈ జానర్ అని లేకుండా మన తెలుగు సినిమా అన్ని జానర్స్ లో కూడా అదిరే కాన్సెప్ట్ లతో సాలిడ్ సినిమాలు తీస్తూ భారీ సక్సెస్ లను అందుకుంటుంది. మరి అలా ఈ ఏడాది వచ్చిన హిట్ చిత్రాల్లో చాలా చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన చిత్రం “మసూద” కూడా ఒకటి.

టక్ జగదీష్ ఫేమ్ నటుడు తిరువీర్ హీరోగా సీనియర్ నటి సంగీత కీలక పాత్రలో శుభలేఖ సుధాకర్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి కిరణ్ తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రం మాత్రం ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి వచ్చిన బెస్ట్ హారర్ థ్రిల్లర్ చిత్రాల్లో టాప్ సినిమాగా చెప్పొచ్చు.

ఎప్పుడో అరుంధతి తర్వాత మళ్లీ తెలుగు సినిమాగా వచ్చి సెన్సేషన్ ని ఇది నమోదు చేసింది. ఇప్పటికీ కూడా థియేటర్స్ లో మిస్ అయ్యిన వారు ఉంటే మాత్రం స్ట్రీమింగ్ యాప్ ఆహా గుడ్ న్యూస్ ఇచేలా ఉన్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఆసక్తికర థ్రిల్లర్ ని ఆహా వారు భారీ చెక్ తో కొనుగోలు చేయగా ఇందులో ఈ డిసెంబర్ లోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మొదటగా అయితే డిసెంబర్ 16 న ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ దీనికి కానీ పాజిబుల్ కాకపోతే ఆ నెక్స్ట్ వీక్ లోనే సినిమా స్ట్రీమింగ్ ఆహా లో ఉండొచ్చు అట. మరి ఈ క్రేజీ థ్రిల్లర్ ని ఇప్పటికీ చూడని వారు అయితే థియేటర్స్ లో ఉంటే చూడొచ్చు లేదా మరికొన్ని రోజులు ఆగితే సరిపోతుంది.