ఫస్ట్ టెలికాస్ట్ లో బాగానే భయపెట్టిన “మసూద”.!

గత ఏడాది టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన పలు బెస్ట్ వర్క్ చిత్రాల్లో మంచి థ్రిల్లింగ్ హిట్ సినిమా “మసూద” కూడా ఒకటి. ఒక్క తెలుగులోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ గా నిలిచిన ఈ సినిమా కోసం మాట్లాడని వారు లేరు. మరి చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ లాభాలు అందించిన ఈ సినిమా కొన్ని రోజులు కితమే టెలివిజన్ తెరపై ఫస్ట్ టైం టెలికాస్ట్ కి వచ్చింది.

కాగా జెమినీ ఛానెల్ వారు ఈ సినిమాని సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా మొదటి టీఆర్పీ రేటింగ్ లోనే 5 పాయింట్స్ కి పైగా వచ్చింది. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన కొందరు స్టార్ హీరోల సినిమాలు భారీ చిత్రాల కంటే చాలా ఎక్కువ కావడం విశేషం.

దీనితో ఈ సాలిడ్ స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్ చిత్రం మొదటి టెలికాస్ట్ లోనే బాగా భయపెట్టింది అని చెప్పొచ్చు. కాగా ఈ సినిమాలో యువ టాలెంటెడ్ నటుడు తిరువీర్ హీరోగా నటించగా కావ్య కే కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. అలాగే సంగీతం ఓ కీలక పాత్రలో నటించగా సాయి కిరణ్ దర్శకత్వం వహించాడు.

అలాగే ప్రశాంత్ ఆర్ విహారి ఇచ్చిన సంగీతం మరింత బాగా సినిమాని ఎలివేట్ చేసింది. అంతే కాకుండా ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో లాభాలను గడించింది.