మార్చి 1న థియేటర్లలోకి రావడానికి తెలుగు సినిమాలు చాలా క్యూ కడుతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా నటించిన ‘ఆపరేషన్ వేలంటైన్’ విడుదల కానుంది. వెన్నెల కిశోర్ హీరోగా తెరకెక్కిన కామెడీ స్పై థ్రిల్లర్ ‘చారి 111’ కూడా ఆ రోజే రానుంది. వీటితో పాటు అనసూయ ఓ పాత్రలో నటించిన ‘రజాకార్’, శివ కందుకూరి ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడీ లిస్టులో మరో చిన్న సినిమా చేరింది.
‘రాధా మాధవం’ సైతం ఆ రోజు విడుదల కానుంది. వినాయక్ దేశాయ్ హీరోగా రూపొందిన ప్లలెటూరి ప్రేమకథా చిత్రం ‘రాధా మాధవం’. అపర్ణ దేవి హీరోయిన్. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. గోనల్ వెంకటేష్ నిర్మాత. ఈ చిత్రానికి కథ, మాటలతో పాటు పాటలను కూడా వసంత్ వెంకట్ బాలా అందించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మార్చి 1న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు చెప్పారు. ‘రాధా మాధవం’ ప్రచార చిత్రాలు, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. చక్కని సందేశాత్మక చిత్రం తీశారని సెన్సార్ సభ్యులు ఇచ్చిన ప్రశంసలు తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయని వారు పేర్కొన్నారు. ‘రాధా మాధవం’ సినిమా ఫస్ట్ లుక్‌ను కొన్ని రోజుల క్రితం రాజ్ కందకూరి విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… ‘హీరోగా వినాయక్ దేశాయ్ రెండో చిత్రమిది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే… మంచి ప్లలెటూరి ప్రేమకథ చూడబోతున్నామని ఫీలింగ్ కలిగించింది. మన ప్రేక్షకులు చిన్నా పెద్దా అని తేడాలు చూడరు. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ఆదరిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా‘ అని చెప్పారు. తమను ఎంకరేజ్ చేస్తున్న రాజ్ కందుకూరికి హీరో వినాయక్ దేశాయ్ కృతజ్ఞతలు చెప్పారు.
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి జంటగా నటించిన ఈ సినిమాలో మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాత: గోనాల్ వెంకటేష్, దర్శకత్వం: దాసరి ఇస్సాకు, కథ – మాటలు – పాటలు: వసంత్ వెంకట్ బాలా, సంగీతం : చైతు కొల్లి, ఛాయాగ్రహణం: తాజ్ జీడీకే, కూర్పు: కె. రమేష్, పోరాటాలు: రాబిన్ సుబ్బు