షాకింగ్ : “ఓజి” సినిమాకి కేవలం పవన్ ఇన్ని రోజులే బ్యాలన్స్ అట

టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగినటువంటి మాస్ హీరోస్ లో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. కాగా ఇప్పుడు పలు సినిమాలు ఇంకా రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ లిస్ట్ లో దర్శకుడు సుజీత్ తో చేస్తున్న మాసివ్ పాన్ ఇండియా చిత్రం “ఓజి” కూడా ఒకటి.

అయితే ఈ చిత్రం పవన్ కెరీర్ లోనే మరో హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా ఇది నిలవగా ఈ చిత్రం విషయంలో కొన్ని ఆసక్తికర వార్తలు సినీ వర్గాల్లో బయటకి వచ్చాయి. దీనితో ఆల్రెడీ సినిమా రిలీజ్ ఏంటి బిజినెస్ కోసం టాక్ వచ్చింది. అయితే అసలు ఈ సినిమా షూటింగ్ పరంగా కూడా ఆసక్తికర వార్తలే వచ్చాయి.

మొదట్లో పవన్ ఈ సినిమాకి ఇచ్చిన డేట్ లు కానీ కంప్లీట్ చేసిన స్పీడ్ కానీ చూసేసరికి గత ఏడాదిలోనే ఈ చిత్రం రిలీజ్ కి వచ్చేసి ఉండేది. కానీ సీన్ కట్ చేస్తే అదే స్పీడ్ లో పవన్ కళ్యాణ్ బ్రేక్ ఇచ్చేసి అందరికీ షాకిచ్చాడు. కానీ మధ్యలో పవన్ లేని కొన్ని సీన్స్ ని సుజీత్ చేసాడు కాని బ్రేక్ మాత్రం ఇప్పటికీ కొనసాగుతుంది.

అయితే పవన్ కోసం నిర్మాత గట్టిగా ట్రై చేస్తున్నాడు కానీ అసలు పవన్ కి ఈ సినిమాలో చాలా తక్కువ రోజుల వర్క్ మాత్రమే మిగిలి ఉందట. కాగా ఇది ఎన్నో రోజు కూడా కాదట కేవలం 17 నుంచి 18 రోజుల వర్క్ మాత్రమే పవన్ పై షూట్ చేయాల్సి ఉంది అని ఒకవేళ అది కంప్లీట్ అయితే సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ ఫాస్ట్ గానే రిలీజ్ కి వచ్చేస్తుంది అని భోగట్టా..