ఆ సినిమా రీమేక్ చేయగలిగే సత్తా కేవలం పవణ్ కల్యాణ్ కి మాత్రమే ఉంది: సాయి ధరమ్ తేజ్

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన ప్రేక్షకుల అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కొండపొలం సినిమాలో నటించి హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ రంగా రంగ వైభవంగా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.

డైరెక్టర్ గిరీషయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన అందాల నటి కేతిక శర్మ నటించింది. సెప్టెంబర్ రెండవ తేదీన వైష్ణవ్ తేజ్ నటించిన రంగ రంగ వైభవంగా సినిమా విడుదల కానుండటంతో తాజాగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ లో సుమ హోస్ట్ గా వ్యవహరించింది. సుమ యాంకరింగ్ అంటే ఈవెంట్ లో సందడి ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్ లో ఈ ముగ్గురు మెగా హీరోలకు సుమ రాపిడ్ ఫైర్ ప్రశ్నలు వేయగా.. వారు కూడా తమ స్టైల్లో సమాధానాలు చెప్పి మెప్పించారు.

ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. పవన్ కళ్యాణ్ భూమిక జంటగా నటించిన ఖుషి సినిమా 2001లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎస్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ యువతని బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఖుషి సినిమాని ప్రస్తుతం మీలో ఎవరు రీమేక్ చేస్తే సెట్ అవుతారు అని సుమా ప్రశ్నించగా.. సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. ఖుషి సినిమాలో ఆ రోల్ చేయగలిగిన హీరో వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ మాత్రమే. ఇంకెవరికీ అది సాధ్యం కాదు అంటూ చెప్పుకొచ్చాడు.