మరోమారు నాగచైతన్య, సాయి పల్లవి??

Sai Pallavi Love Story Teaser Pics

టాలీవుడ్ లో ఉన్నటువంటి పలు హిట్ పెయిర్స్ లో అయితే లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి అలాగే యంగ్ హీరో నాగ చైతన్య ల కాంబినేషన్ కూడా ఒకటి అని చెప్పాలి. వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమానే భారీ హిట్ అయ్యింది. దర్శకుడు శేఖర్ కమ్ములతో చేసిన “లవ్ స్టోరీ” అనే సినిమా పెద్ద హిట్ కావడంతో వీరి జంటపై కూడా మంచి పాజిటివ్ అనిపించింది.

కాగా నాగ చైతన్య మరియు ఇప్పుడు సాయి పల్లవి లు అయితే మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అని రూమర్స్ వస్తున్నాయి. ఐతే ఇది ఏ ప్రాజెక్ట్ అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు అయితే దర్శకుడు చందూ మొండేటితో నాగ చైతన్య భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

కాగా ఇది కూడా లవ్ స్టోరీ తరహాలోనే నాగ చైతన్య ఒక అణగారిన కులానికి చెందిన కుర్రాడిగా కనిపిస్తాడు అని యాక్ ఉంది. ఇదే టైప్ లో లాస్ట్ టైం “కస్టడీ” లో కూడా కనిపించిన సంగతి తెలిసిందే. వరుస లవ్ స్టోరీ లో కూడా కనిపించి ఇప్పుడు మరో సినిమా చేస్తుండడంతో అయితే మరి ఇందు కోసం సాయి పల్లవిని తీసుకున్నారో ఏమో అనేది క్లారిటీ రావాల్సింది.

కాగా ఇప్పుడు సాయి పల్లవి తెలుగు సహా తమిళ్ లో కూడా పలు చిత్రాలు ఓకే చేయగా బాలీవుడ్ ఎంట్రీ కూడా స్టార్ హీరో ఆమీర్ ఖాన్ కొడుకుతో ఎంట్రీ ఇవ్వనుంది అని రూమర్స్ ఉన్నాయి. మరి వీటి అన్నటికి కాలమే సమాధానం చెప్పాలి.