మరోసారి భగ్గుమన్న చిరు వర్సెస్ పవన్ ఫ్యాన్స్ వార్.!

టాలీవుడ్ సినిమా దగ్గర మెగా ఫామిలీ కి కానీ వారి కుటుంబ హీరోస్ కి గాని ఉన్న మార్కెట్ వారి ఫాలోయింగ్ వేరు అని చెప్పాలి. అయితే మెగాస్టార్ అనే వ్యక్తి లేకపోతె ఇప్పుడు ఉన్న పవర్ స్టార్ లు మెగాపవర్ స్టార్ లు అలాగే ఐకాన్ స్టార్ లు కూడా లేరు అనేది జగమెరిగిన సత్యం.

అయితే ఇన్నేళ్ల చిరు సినీ ప్రస్థానంలో చూడనిది ఏది లేదు. తాను చూడని హిట్టు ప్లాప్ రాజకీయాల్లో పరాభవాలు అన్నీ చూసి మళ్ళీ తనకి అన్నం పెట్టిన సినిమాలోనే ఉన్నారు. అయితే మధ్యలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం అన్నయ్యని కాదు అని కొన్ని నిర్ణయాలు లాంటివి చాలానే ఫ్యాన్స్ లో చీలిక తీసుకొచ్చాయి.

కానీ అల్టిమేట్ గా మెగా బ్రదర్స్ మాత్రం అంతా ఒకటే అని ప్రూవ్ చేశారు. అయితే ఫ్యాన్స్ లో మాత్రం ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కొన్ని రాజకీయ శక్తులు చేసిన పరిణామాలు ఇప్పుడు చిరు వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మధ్య మంట పెట్టినట్టుగా అంటున్నారు.

పవన్ పార్టీకి చెందిన ఓ మహిళా నేత చిరు పై పలు వ్యాఖ్యలు చేసింది అని చిరు ఫ్యాన్స్ చాలా మంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమెని తిట్టారు అలాగే దానిని పవన్ కి కూడా ఆపాదించారు. అయితే ఆమె చెప్పిన దానిలో తప్పు దొర్లింది అని స్వయంగా మరో మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా ట్వీట్ చేశారు.

అలాగే చిరు ని ఎంతో మంది రాజకీయ నాయకులూ ఇంతకంటే నీచంగా మాట్లాడినపుడు ఇప్పుడు ఆమెపై మాట్లాడిన వారు అంతా కూడా ఎక్కడ ఉన్నారు అని పవన్ ఫ్యాన్స్ డిఫెండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నిజానికి ఆమె వీడియో ఎప్పుడో పాతది అయినప్పుడు దానిని ఇప్పుడే హైలైట్ కొందరు హైలైట్ చేసి మెగా ఫ్యాన్స్ ని విడదీసి పవన్ ని పొలిటికల్ గా దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని దానిని ఇతర ఫ్యాన్స్ అర్ధం చేసుకోవాలని ఇద్దరినీ ఇప్పటికీ నమ్ముతున్న ఫ్యాన్స్ అయితే విన్నవించుకుంటున్నారు.