మరోసారి ఆయన అందరి హృదయాలు గెలిచేస్తారు.. గేమ్ చేంజర్ మూవీ పై శంకర్ కామెంట్స్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజ‌ర్‌’ ట్రైలర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు శంక‌ర్ మార్క్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా లార్జ‌ర్ దేన్ లైఫ్ మూవీగా గేమ్ చేంజ‌ర్‌ను ఆవిష్క‌రించిన‌ట్లు సుస్ప‌ష్టంగా ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి చేతుల మీదుగా ‘గేమ్ చేంజ‌ర్‌’ ట్రైల‌ర్ విడుద‌ల కావ‌టం విశేషం.

ఈ సందర్భంగా డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు. అందరూ శంకర్, సంకాంత్రి కలిపి శంకరాత్రి అని అంటున్నారు. కానీ ఇది రామ నవమి. రామ్ చరణ్ తన పాత్రల్లో ఒదిగిపోయారు. అక్కడ రామ్ చరణ్ కాకుండా మీకు ఆ పాత్రలే కనిపిస్తాయి. అంత అద్భుతంగా కనిపిస్తారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రామ్ చరణ్‌ను చూసేందుకే జనాలు వచ్చేస్తారు.

ఈ సినిమాతో మరోసారి రామ్ చరణ్ అందరి హృదయాల్ని గెలిచేస్తారు.శ్రీకాంత్ గారు ప్రోస్థటిక్ మేకప్‌తో చాలా చక్కగా నటించారు. చూస్తే నార్మల్‌గా ఉంటారు. కెమెరాముందుకు వస్తే మాత్రం సింహాంలా నటించేస్తారు. సముద్రఖని గారు ఎంతో సహజంగా నటిస్తారు.అంజలి గారు తన నటనతో పాత్రకు జీవం పోశారు. ఎస్ జే సూర్య లాంటి యాక్టర్స్‌ని చాలా అరుదుగా చూస్తుంటాం.నేను ఏం అడిగినా, ఏం చెప్పినా కూడా దిల్ రాజు ఇచ్చారు. నన్ను తెలుగుకి పరిచయం చేసినందుకు దిల్ రాజు గారికి థాంక్స్.

కార్తిక్ సుబ్బరాజ్ వద్ద కథను తీసుకుని ఈ మూవీని చేశాను.అలాగే రెహమాన్ లేడనే లేటు నాకు తెలీకుండా తమన్ నా నమ్మకాన్ని నిలబెట్టి సంగీతం ఇచ్చారు. ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చారు. డీఓపీ తిరు గారు ఒక్కో విజువల్‌ను ఐ క్యాచీగా ఇచ్చారు. ఫస్ట్ టైం ఇన్ ఫ్రా రెడ్ టెక్నాలజీ వాడాం. హాలీవుడ్ కూడా ఇప్పుడు మనలా సినిమాలు తీయాలని అనుకుంటున్నారు. దానికి కారణం రాజమౌళి గారు. జనవరి 10న గేమ్ చేంజర్ రాబోతోంది’ అని శంకర్ అన్నారు. ప్రమోషన్స్ ఈవెంట్స్ ఎలివేషన్ చూస్తుంటే మళ్ళీ వింటేజ్ శంకర్ ని చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సదరు ప్రేక్షకులు.