PSPK28: మరోసారి గబ్బర్ సింగ్ కాంబో రిపీట్.. పవన్ కొత్త మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ఇదిగో..!

Once again gabbar singh combo repeating

మరోసారి గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కాబోతున్నది. అంటే మరోసారి రికార్డులు బద్దలు అన్నమాటే. అవును.. పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు తీసినా గబ్బర్ సింగ్ ఆయన సినీ కెరీర్ లో ఓ మైలు రాయి. ఆ సినిమా వల్ల సినిమా ఇండస్ట్రీలో పవన్ మరో మెట్టు ఎక్కారు.

Once again gabbar singh combo repeating
Once again gabbar singh combo repeating

అందుకే.. గబ్బర్ సింగ్ సినిమా అనేది పవన్ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమా. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ అదే కాంబో రిపీట్ కాబోతున్నది.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరోసారి పవన్ కళ్యాణ్ నటించబోతున్నారు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఇప్పటికే వకీల్ సాబ్ మోషన్ పోస్టర్, క్రిష్ డైరెక్షన్ లో వచ్చే మరోసినిమా ప్రీ లుక్ రిలీజ్ అయ్యాయి. అవి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.

తాజాగా.. పవన్ బర్త్ డే సందర్బంగా హరీశ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాను కూడా అధికారికంగా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది.

Once again gabbar singh combo repeating
Once again gabbar singh combo repeating

ఇది కేవలం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే కాదు.. అంటూ హరీశ్, పవన్ కాంబోలో వస్తున్న సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చనున్నారు.

ఒక బైక్ దాని మీద పెద్ద బాలశిక్ష పుస్తకం పెట్టి సరికొత్త లుక్ తో కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే.. గబ్బర్ సింగ్ కు వందరెట్ల పవర్ తో  ఈ సినిమా రాబోతున్నదని అర్థం అవుతోంది. పవన్ అభిమానులకు ఇక పండగే.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బాలీవుడ్ మూవ పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. వకీల్ సాబ్ సినిమాకు వేణు శ్రీరామ్ డైరెక్టర్. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే పవన్ కళ్యాణ్.. క్రిష్ ప్రాజెక్టుతో జాయిన్ అవుతారు. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యాక.. హరీశ్ శంకర్ తో సినిమా చేయనున్నారు.