పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల గురించి అస్సలు ఆలోచించే పరిస్థితుల్లో లేరు. కానీ, ఆయన హీరోగా ప్రారంభమైన ‘ఓజీ’ సినిమా రిలీజ్ డేట్ అయితే చిత్ర నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసేసింది. అసలేంటి కథ.? ఆని ఆరా తీస్తే, ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని తేలిపోతోందిట.!
వాస్తవానికి, ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గట్టిగానే డేట్స్ కేటాయించాల్సి వుంది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రసహనం పూర్తయ్యేదాకా పవన్ కళ్యాణ్, సినిమాలకు డేట్స్ కేటాయించే అవకాశమే లేదన్నది నిర్వివాదాంశం.
పోనీ, ఎన్నికలు పూర్తయ్యాక పవన్ కళ్యాణ్, సినిమాలకు టైమ్ కేటాయిస్తారా.? అంటే, వెంటనే కుదరదు. గెలుపోటములు, ఇతరత్రా వ్యవహారాలు.. చాలా లెక్కలుంటాయ్. ఈసారి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చట్ట సభలకు వెళ్ళే అవకాశముంది.
ఒకవేళ అన్నీ కలిసొచ్చి, మ్యాజికల్ ఈక్వేషన్‌తో పవన్ కళ్యాణ్ గనుక ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటేనో.? అదే జరిగితే, ‘ఓజీ’ సహా, ఇతర సినిమాలన్నీ అర్థాంతరంగా ఆగిపోయినట్లే. సమీప భవిష్యత్తులో అవి తిరిగి పట్టాలెక్కవు.
ఎలా చూసినా, ‘ఓజీ’ సినిమా ఈ ఏడాది పూర్తయ్యే అవకాశమే కనిపించడంలేదన్నమాట. మరెలా నిర్మాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసినట్లు.? ఇప్పటివరకు జరిగిన షూటింగుతోనే, సినిమాని ఎలాగోలా విడుదల చేసేస్తారా.? ప్చ్.. ఆ అవకాశం కూడా లేదట.