ఓజీ రిలీజ్ డేట్ కన్ఫామ్.! షూటింగ్ ఎప్పుడు పూర్తయ్యేనో.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘ఓజీ’ రిలీజ్ డేట్ బయటకు వచ్చేసింది. సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ చేయబోతున్నారట. ఇంతకంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ ఇంకేముంటుంది.?

అబ్బే, సినిమా వేరు.. రాజకీయం వేరు.! ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా మూడ్‌లో లేరు. పొలిటికల్ మూడ్‌లో వున్నారు. ఆయనైతే, సినిమాల్ని పూర్తిగా పక్కన పెట్టేసి రాజకీయాల్లో బిజీ అయిపోయారు.

సుజీత్ దర్శకత్వంలో ప్రారంభమైన ‘ఓజీ’ సినిమా షూటింగ్ ఎంత పార్ట్ పూర్తయ్యిందన్నది ఇప్పటికీ సస్పెన్సే. ప్రియాంక మోహన్ హీరోయిన్. శ్రియా రెడ్డి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

ఓ పది పదిహేను రోజుల డేట్స్ పవన్ కళ్యాణ్ కేటాయిస్తే సినిమా పూర్తయిపోతుందన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ సినిమాకి డేట్స్ కేటాయించే పరిస్థితి లేదు.

2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలా వుంటాయో ఎవరూ చెప్పలేరు. సో, రిలీజ్ డేట్ అన్నది, బయట నుంచి నిర్మాతలపై వస్తున్న ఒత్తిడి మేరకు ‘ప్రకటన’ జరిగిందని అనుకోవాలేమో.!