“OG” పై బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ సైన్ తెరకెక్కిస్తున్న మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “OG” కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కెరీర్ లో మరి హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా దీనిని తెరకెక్కిస్తుండగా మరికొన్ని రోజుల్లో మిగిలిన షూటింగ్ అయితే జరగనుంది.

కాగా ఈ చిత్రం నుంచి ఈ సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కానుకగా చిత్ర యూనిట్ ఓ భారీ అప్డేట్ ని ఇస్తున్నట్టుగా ఇది వరకే కన్ఫర్మ్ చేశారు. కానీ మళ్ళీ మధ్యలో సైలెంట్ అయిపోయారు. దీనితో ఎగ్జైట్మెంట్ తో పిచ్చెక్కిపోతున్న అభిమానులు సోషల్ మీడియాలో అయితే క్రేజీ చిత్ర యూనిట్ ని అప్డేట్ కోసం అడుగుతున్నారు.

మరి దీనికి వారు లేటెస్ట్ గా ఇచ్చిన రిప్లై ఫ్యాన్స్ లో మరింత హైప్ ని తీసుకొచ్చింది. ఈ సెప్టెంబర్ 2న అన్నీ పేల్తాయి మీరు ఊహించని చూడని హై ని అయితే మీరు ఆశించవచ్చు అని క్రేజీ రిప్లై ఇచ్చి వదిలేసారు. దీనితో ఫ్యాన్స్ ఇప్పుడు మరింత హైప్ లోకి వెళ్లిపోతున్నారు.

మొత్తానికి అయితే ఈ సెప్టెంబర్ 2న మాత్రం ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ రాబోతుంది అని చెప్పాలి. కాగా ఇదే ట్రీట్ ని పవన్ రీ రిలీజ్ చిత్రం గుడుంబా శంకర్ తో కూడా థియేటర్స్ లో పడుతుంది అని స్ట్రాంగ్ టాక్ ఉంది. మరి సుజీత్ అండ్ టీం ఏం ప్లాన్ చేసారో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.