విరూపాక్ష డిజిటల్ స్ట్రీమింగ్.. ఎందులో అంటే..

సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో మిస్టీరియస్ హర్రర్ థ్రిల్లర్ విరూపాక్ష సినిమా తాజాగా ప్రేక్షకుల మందికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. కార్తీక్ దండు రాసుకున్న కథ, సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నాయనే మాట ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాతో తేజు బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నట్లే అనే ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో అన్ని సినిమాలు కూడా రిలీజ్ కి ముందే ఓటీటీ పార్ట్నర్ ని కన్ఫామ్ చేసుకుంటున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలు పోటాపోటీగా సినిమా రైట్స్ ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఎక్కువ ధర ఇచ్చే ఓటీటీ ప్లాట్ఫామ్ లకి నిర్మాతలు తమ సినిమాల డిజిటల్ రైట్స్ ముందుగానే ఇస్తున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన తేజ్ విరూపాక్ష డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ కూడా కన్ఫామ్ అయినట్లే తెలుస్తోంది. తెలుగు సినిమా మార్కెట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టిన నెట్ ఫ్లిక్స్ వరుసగా మంచి బజ్ క్రియేట్ చేసే చిత్రాల డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో విరూపాక్ష డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కూడా నెట్ ఫ్లిక్స్ దగ్గించుకోవడం విశేషం. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఫాన్సీ ధర చెల్లించి నెట్ ఫ్లెక్స్ సొంతం చేసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. గత నెల ఆఖరులో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన నాచురల్ స్టార్ నాని దసరా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27న దసరా సినిమాని నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు విరూపాక్ష సినిమా రైట్స్ కూడా అదే స్ట్రీమింగ్ కంపెనీ దక్కించుకోవడం విశేషం. అన్ని కరెక్ట్ గా ఉంటే వచ్చే నెల ఆఖరికి విరూపాక్ష సినిమా కూడా డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో లాంగ్ రన్ లో విరూపాక్ష ఎంత కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి అనేది వేచి చూడాలి.