అఫీషియల్ : షారుక్ తో అనుష్క పోటీ.!

ఈ ఏడాది నెక్స్ట్ ఇండియన్ సినిమా దగ్గర బిగ్ రిలీజ్ కి ఉన్న భారీ చిత్రాల్లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “జవాన్” కూడా ఒకటి. పాన్ ఇండియా వైడ్ గా భారీ హైప్ ఉన్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుండగా.. 

ఈ చిత్రం డేట్ కి అయితే మేజర్ రిలీజ్ లు ఏవి లేవు. కానీ మన టాలీవుడ్ నుంచి అయితే స్టార్ హీరోయిన్ అనుష్క నుంచి అది కూడా చాలా కాలం తర్వాత అవైటింగ్ గా ఎదురు చూస్తున్న చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” చిత్రంని మేకర్స్ ఇపుడు అధికారికంగా ఫిక్స్ చేసేసారు.

ఇది వరకే ఈ డేట్ న అనుష్క చిత్రం షారుక్ తో భారీ పోటీకి రెడీ అవుతుంది అని చెప్పాము. ఇది ఇదే నిజం అవుతూ ఈ సెప్టెంబర్ 7న రిలీజ్ కి ఈ చిత్రాన్ని మేకర్స్ ఇప్పుడు లాక్ చేసేసారు. దీనితో బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీ పోటీ తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పక తప్పదు.

జవాన్ కి తెలుగు సహా తమిళ్ కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక అనుష్క చిత్రం కూడా తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. మరి ఏ చిత్రానికి నష్టం ఉంటుందో చూడాలి. ఇక మిస్ శెట్టి చిత్రంలో హీరోగా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించగా దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వం వహించాడు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.