అక్క కంటే చెల్లెలు చాలా షార్ప్ గురూ.!

కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. మాస్ రాజా రవితేజ హీరోగా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో నుపుర్ సనన్ తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ కాబోతోంది.

రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ కృతి సనన్‌కి ఇంతవరకూ తెలుగులో మాట్లాడడం చేతకాదు. కానీ, నుపుర్ సనన్ తొలి సినిమా రిలీజ్ కాకుండానే తెలుగులో మాట్లాడడం నేర్చుకుందట.

తెలుగులో చక్కగా మాట్లాడేస్తోందట. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తెలుగులో పాట పాడి నుపుర్ సనన్ షాకచ్చింది. అంతేకాదట.. నుపుర్ సనన్ క్విక్ లెర్నర్ అనీ తెలుస్తోంది.

లాంగ్వేజెస్‌ని చాలా ఈజీగా నేర్చేసుకుంటుందట. అంతా బాగుంది కానీ, యాక్టింగ్ స్కిల్స్ గట్రా ఎలా వున్నాయో ఫస్ట్ సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు.

అన్నట్లు ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండానే నుపుర్ సనన్ ఇంకో ఛాన్స్ కూడా కొట్టేసింది. మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న సినిమాలో నుపుర్ సనన్ నటిస్తోంది.

అయితే, ఇంత యాక్టివ్‌గా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోవడానికి నుపుర్ చేస్తున్న ప్రయత్నాల వెనుక తన అక్క కృతిసనన్ వుందని అంటున్నారు.

సినిమాల్లోకి రాకముందే, ఓ ట్యూటర్‌ని పెట్టి తెలుగు మాట్లాడడం నేర్పించిందట కృతి సనన్. అలాగే సినిమాల్లో ఎంటర్ అవ్వడానికి ముందే, ఎవరితో ఎలా మాట్లాడాలి.? ఎవరెవరితో ఎలా మసలుకోవాలి.? వంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా చెప్పి దించిందట. అక్క చెప్పినట్లుగాన యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోతోందట నుపుర్ సనన్.