NTR: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ హీరో బావమరిది…. రాజావారు సినిమాతో సక్సెస్ అవుతాడా?

 

NTR: జూనియర్ ఎన్టీఆర్ బావమరిది అయినా నితిన్ నార్నే తెలుగు చిత్రం తో హీరోగా పరిచయం కాబోతున్నాడు. నితిన్ నటిస్తున్న ఈ సినిమాకి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రానికి “శ్రీశ్రీశ్రీ రాజావారు” అనే టైటిల్ ను ఖరారు చేశారు.  శ్రీ వేధాక్షర మూవీస్  ఈ సినిమాని నిర్మిస్తుంది.ఈ చిత్రానికి మలయాళ సంగీత దర్శకుడు కైలాస్ మీనన్‌  సంగీత దర్శకత్వం చేస్తున్నారు.

ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తున్నారనే విషయాన్నీ మాత్రం మేకర్స్ సస్పెన్స్ లో ఉంచారు.  కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తున్నారా లేక పోతే ఇంతకు ముందే క్రేజ్ ఉన్న హీరోయిన్ నే తీసుకుంటున్నారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేశారు.

పోస్టర్‌ను బట్టి చూస్తే నితిన్ ఫస్ట్ మూవీ కోసం మాస్ జోనర్ ను ఎంచుకున్నట్టుగా కన్పిస్తోంది. ఈ పోస్టర్ లో నితిన్ సిగరెట్‌ తాగుతూ కన్పిస్తుండగా, బ్యాక్ గ్రౌండ్ లో ఏదో జాతరలా కన్పిస్తోంది.మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా  ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఎన్టీఆర్  బావమరిది గా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న నితిన్ ని అభిమానులు ఆదరిస్తారోచూడాలి.