సలార్ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఎప్పుడో ఈ సినిమాని కన్ఫర్మ్ చేశారు. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా ఫోటోషూట్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఎనౌన్స్ చేసి ఏడాదికి పైగానే అవుతోంది.
ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. నవంబర్ నాటికి ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవ్వనుంది. తరువాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి చేయబోయే వార్ 2 సినిమా కోసం మూడు నెలలు తారక్ డేట్స్ కేటాయించారు. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారంట.
ఇక సలార్ 1 సెప్టెంబర్ 28న రిలీజ్ ప్లాన్ చేస్తోన్న ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 2ని వేసవిలో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ ఫారిన్ వెళ్లి అక్కడ NTR 31 మూవీ స్క్రిప్ట్ తో పాటు ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయనున్నారంట. ఈ చిత్రాన్ని పూర్తిగా విదేశాల్లోనే చిత్రీకరించడానికి ప్రశాంత్ నీల్ కథని సిద్ధం చేశారంట.
ఈ నేపథ్యంలోనే ఐదు నెలల పాటు విదేశాలలో NTR 31 ప్రీప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేయనున్నారని తెలుస్తోంది. అవి కంప్లీట్ అయ్యాక వచ్చే ఏడాది ఆఖరులో సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ఆ చిత్రాన్ని కంప్లీట్ చేసి 2026లో రిలీజ్ చేసే ప్లాన్ లో దర్శకుడు ఉన్నారని ప్రచారం నడుస్తోంది.
అదే జరిగితే ప్రశాంత్ నీల్ 2026 వరకు ఇంకో హీరోతో మూవీ చేసే అవకాశం లేదు. అంటే కేజీఎఫ్ చాప్టర్ 3 ఉన్నా కూడా అది NTR 31 కంప్లీట్ అయిన తర్వాతనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ఇంత లాంగ్ షెడ్యూల్స్ పెట్టుకుంటే తారక్ నుంచి కూడా ఏడాదికి ఒక్క సినిమాకి మించి ఆశించడం కష్టం అని చెప్పొచ్చు.