యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక న్యూఇయర్ సందర్భంగా త్రివిక్రమ్ హీరో ఎన్టీఆర్‌ను కలిసిన ఫోటోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇంకా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుందంటూ హారిక అండ్ హాసినీ క్రియేషన్స్, యన్.టీ.ఆర్ ఆర్ట్స్ సినిమా నిర్మాణ సంస్థలు తెలిపారు.
అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీకి చౌడప్పనాయుడు అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తోందని సమాచారం. అయితే ఈ విషయం గురించి ఇంతవరకు చిత్రయూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా తరవాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎన్టీఆర్ 30వ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మూడు భాషలకు చెందిన ముగ్గురు సీనియర్ హీరోలు కీలక పాత్రలు పోషిస్తున్నారని ఇప్పటికే వదంతులు వచ్చాయి. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ సీనియర్ నటుడు జయరాంలను త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకువస్తున్నారని అంటున్నారు. అంతేకాదు, ఒక హీరోయిన్‌గా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను కూడా సంప్రదిస్తున్నారని టాక్.