ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువగానే ఉన్న రామ్ చరణ్ క్యారెక్టర్ ను ప్రభావితం చేసే రోల్ కావడం విశేషం. ఇక రామ్ చరణ్ గురించి తారక్ కి నిజం తెలియడానికి కారణం అయ్యే పాత్రలో అలియా ఈ సినిమాలో సీతగా కనిపించి మెప్పించింది.
ఆమె నటించిన నాలుగైదు సన్నివేశాలలో అయిన కథలో అలియా భట్ ఇంపాక్ట్ ఉండేలా రాజమౌళి కథాంశం నేరేట్ చేయడం విశేషం. ఇక ఆ సినిమా నుంచి రామ్ చరణ్ తారక్ అలియాభట్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ముఖ్యంగా తారక్ తో అలియా భట్ ఎక్కువ క్లోజ్ కావడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ హ్యూమర్ కి అలియా భట్ ఫ్యాన్ అయిపోయింది.
ఇదిలా ఉంటే తాజాగా అలియా భట్ జూనియర్ ఎన్టీఆర్ పిల్లలైన అభయ్, భార్గవ్ రామ్ కి ప్రత్యేకంగా క్లాత్స్ పంపించింది. ఇక ఆ ఫోటోలను తారక్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి అలియాకి థాంక్స్ చెప్పారు. అదే సమయంలో తన పేరుతో కూడా ఒక బ్యాగ్ త్వరలో వస్తుందని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టారు.
దీనికి అలియా భట్ కూడా రియాక్ట్ అయ్యి ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ చేయడం విశేషం. తప్పకుండా నేను మీకోసం ప్రత్యేకంగా ఎడ్ ఎ మామలో దుస్తులు తయారు చేయిస్తాను. మీరు చాలా స్వీటెస్ట్ పర్సన్ అని లవ్ సింబల్స్ పెట్టి థాంక్యూ చెప్పింది. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం అలియా భట్ ఎడ్ ఎ మామ అనే కిడ్స్ డ్రెస్ లకి సంబంధించి ఆన్ లైన్ క్లాత్ స్టోర్ స్టార్ట్ చేసింది.
తన షాప్ నుంచే ఎన్టీఆర్ పిల్లల కోసం డ్రెస్సులు పంపించినట్లు తారక్ షేర్ చేసిన ఫోటో బట్టి అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అందరూ కూడా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అలియా భట్ కూడా ఇంటర్నేషనల్ అవార్డులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ షేర్ చేసి విషెస్ చెప్పింది.