‘దేవర’ బాధ్యత అంతా ఎన్టీయార్‌దే.!

ఎన్టీయార్ సినిమాలకు సంబంధించి గతంలో పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడాయన ప్యాన్ ఇండియా స్టార్. కాదు కాదు, గ్లోబల్ స్టార్. సో, తదుపరి చేయాల్సిన సినిమాలన్నీ ఒళ్లు దగ్గర పెట్టుకుని చేయాల్సి వుంటుంది. ఆయన నుంచి త్వరలో రాబోతున్న సినిమా ‘దేవర’. లేట్ అయ్యి లేట్ అయ్యి.. లేటెస్ట్‌గా స్టార్ట్ అయ్యిందీ సినిమా.

ఈ సినిమా ఎన్టీయార్‌కి చాలా చాలా ప్రతిష్టాత్మకం. సో, అంతా తానే దగ్గరుండి చూసుకుంటున్నాడట. మామూలుగా అయితే, కొరటాల శివ సినిమాలకు పూర్తి బాధ్యత ఆయనదే వుంటుంది. ఇంకెవ్వరికీ ఛాన్స్ ఇవ్వరాయన. ఆయన స్పెషల్ టీమ్ మాత్రమే వర్క్ చేస్తుంటుంది. కానీ, ‘దేవర’కి సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్నీ ఎన్టీయారే స్వయంగా చూసుకుంటున్నాడట.

అందుకోసం స్పెషల్‌గా ఓ టీమ్ వర్క్ చేస్తోందట. మేకింగ్ నుంచి, గ్రాఫిక్స్ వరకూ అంతా ఎన్టీయారే చూసుకుంటున్నాడట. అందుకు కారణం ‘ఆచార్య’ ఫెయిల్యూర్ కావచ్చు మరేదైనా ఇతర కారణాలు కావచ్చు.. ఎన్టీయార్ ఎవ్వర్నీ నమ్మడం లేదట.

తన సొంత టీమ్‌తోనే పని చేయించుకుంటున్నాడట. షూట్ పూర్తయిన తర్వాత ఫైనల్‌గా అవుట్ పుట్‌కి సంబంధించి అంతా ఎన్టీయార్ కను సన్నల్లోనే జరుగుతోందట. మరి చివరిగా, ‘దేవర’పై ఎన్టీయార్ మార్కుంటుందా.? కొరటాల మార్కుంటుందా.? అనేది చూడాలి మరి.