NTR: చరణ్ అభిమానులు నాకు ఆర్ఆర్ఆర్ వల్ల దొరికిన వరం అంటున్న ఎన్టీఆర్…!

NTR: నందమూరి వారసుడు ఎన్టీఆర్ తన ప్రతిభతో ఒక్కోమెట్టు ఎక్కుతూ సినీ పరిశ్రమలో టాప్ హీరో రేంజ్ కి వెళ్ళాడు. ఎంత ఎత్తుకు వెళ్లిన ఒదిగి ఉన్నాడు ఎన్టీఆర్. అందరి హీరోలతో కలిసి మెలిసి ఉండటం ఆయన ప్రత్యేకత.అల్లు అర్జున్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరినొకరు బావ అని పిలుచుకుంటారనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ఎవరు మీలో కోటీశ్వరులు షోకు మహేష్ బాబు హాజరై సందడి చేశారు. ఇక మహేష్ ను ఎన్టీఆర్ అన్న అని పిలుస్తారు.ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత లాంఛ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ ప్రీమియర్స్ కు ప్రభాస్ వస్తాడా? అంటూ ఎన్టీఆర్ చేసిన కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. హీరోలు హీరోలు బాగానే ఉంటారు కానీ వారి అభిమానులు మాత్రం ఏదో ఒక సందర్భంలో మా హీరో గొప్ప అంటే,మా హీరో గొప్ప అంటూ గొడవపడుతుంటారు. ప్రతి సారి హీరోలు వాళ్ళ అభిమానులకు హితబోధ చేస్తూనే ఉన్న వాళ్ళ తీరు మాత్రం మారడం లేదు.

అయితే ఎన్టీఆర్ తాజాగా ఒక సందర్భంలో ఆర్ఆర్ఆర్ వల్ల చరణ్ ఫ్యాన్స్ తనకు దక్కారని అభిమానులు సఖ్యతతో ఉంటే మరిన్ని గొప్ప సినిమాలు వస్తాయని చెప్పారు. ఫ్యాన్స్ వార్ ఆపేయాలని తారక్ పరోక్షంగా అభిమానులకు చెప్పకనే చెప్పేశారు. తారక్ అభిమానులు తమ ఫేవరెట్ హీరో చెప్పిన మాటలను గుర్తుంచుకుని ఇకనైనా జాగ్రత్త పడతారేమో చూడాల్సి ఉంది. తారక్ ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో, బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు.