NTR: కబడ్డీ ఆటగాడిగా ఎన్టీఆర్.. ‘పెద్ది ’ షూటింగ్ మొదలవుతోందా?

NTR: మాన్ అఫ్ మాసెస్ గా అభిమానులతో పిలవబడే నందమూరి చిన్నోడు రెండేళ్లు వెండితెర పై రాజమౌళి తో సినిమా వల్ల కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని సినిమాలో చూడడానికి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత వరుస పెట్టి సినిమాలను లైన్లో పెట్టాడు.

ఆర్ఆర్ఆర్ ప్రొమోషన్స్ లో బిజీ గా ఉన్న ఎన్టీఆర్ అయిన వెంటనే కొరటాల శివ డైరెక్షన్ లో తీయబోతున్న పొలిటికల్ డ్రామా లో నటించబోతున్నారు. ఇక చాలా రోజుల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్తో ప్యాచ్ అప్ చేసుకున్న ఎన్టీఆర్ ఇంకో చిత్రాన్ని త్రివిక్రమ్ తీయబోతున్నారట. త్రివిక్రమ్ తో చర్చల్లో ఉన్న సినిమా దాదాపు ఓకే అయినట్టే అని టాక్.ఇటీవలే భీమ్లా నాయక్ ను ప్రైవేట్ స్క్రీనింగ్ ద్వారా చుసిన ఎన్టీఆర్ త్రివిక్రమ్ ను కథ స్క్రీన్ ప్లే విషయం లో ప్రశంసించారు కూడా.

ఇక సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన మొదటి సినిమా ఉప్పెన తో మంచి విజయంతో పాటు ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు. బుచ్చి బాబు డైరెక్షన్ లోని సినిమాలో కబడ్డీ ఆటగాడి గా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. పెద్ది అనే టైటిల్ ను సినిమా కోసం అనుకుంటున్నారు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. పిరియాడిక్ డ్రామా గా తెరకేక్కనున్న ఈ చిత్రం ఏప్రిల్ నుండి షూటింగ్ మొదలవుతుందని భోగట్ట.