Ram Charan : ఎపుడు నా పక్కనే ఉండాలని కోరుకుంటున్న….. తారక్ ఎమోషనల్ పోస్ట్…!

Ram Charan : ఇపుడు ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ మనియా నే నడుస్తోంది. అందులోను రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటన రాజమౌళి దర్శకత్వం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇండియా లోనే కాకుండా విదేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ పండగ ఓ వైపు ఉంటే రామ్ చరణ్ 37వ పుట్టిన రోజు రావడంతో అభిమానుల సందడి రెట్టింపు అయింది. సోషల్ మీడియా లో రామ్ చరణ్ కు శుభాకాంక్షలు చెబుతూ సెలబ్రిటీ లతో మొదలుకొని అభిమానుల వరకు అందరు పోస్ట్ లు పెడుతున్నారు.

ఇక తాజాగా చరణ్ కి ఎంతో ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపాడు తారక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఎంతగా బలపడిందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటర్వ్యూలోనూ రామ్ చరణ్, తారక్ ల మధ్య స్నేహ బంధం ఎంత గొప్పదో బయటపడుతూనే ఉంది. ఇక అంతటి గొప్ప స్నేహితుడికి ఎంతో స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు తారక్.

ఒక అరుదైన ఫోటోను షేర్ చేస్తూ ‘ జన్మదిన శుభాకాంక్షలు రామ్ చరణ్.. నువ్వు ఎల్లప్పుడు నా పక్కన ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. ఇక నుంచి మనం మరిన్ని జ్ఞాపకాలను కలిసి సృష్టించుకుందాం’ అంటూ తెలిపారు. ఇక ఆ ఫొటోలో చరణ్ షర్ట్ బటన్స్ పెడుతూ తారక్ చిరునవ్వు చిందిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మీ స్నేహం కలకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామంటూ ఇద్దరి హీరోల అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.