NTR : కొరటాల శివ సినిమా కోసం ఎన్టీఆర్ న్యూలుక్..! వైరల్ అవుతున్న ఫోటో..

NTR: మార్చ్ 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ విడుదల అయ్యి రెండు వారాలు అవుతున్న కలెక్షన్ల రికార్డు లు మాత్రం ఆగట్లేదు. ఆర్ఆర్ఆర్ భారీ విజయం తరువాత రామ్ చరణ్ ఎన్టీఆర్ తదుపరి చిత్రాలపై అభిమానుల ఆసక్తి పెరిగింది. రామ్ చరణ్ అపుడే తన తదుపరి చిత్రం శంకర్ దర్శకత్వం లో మొదలెట్టేసాడు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ధ్విపత్రాభినయం చేస్తున్నారు. అంతే కాదు ఈ సినిమా అపుడే 30% షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

అయితే ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఇంకా పట్టాలెక్కలేదు.ఎన్టీఆర్ తన 30 వ చిత్రనికి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కొరటాల శివ తో చేస్తున్నట్టు చెప్పి ఏడాది అవుతున్న దీనికి సంబందించిన అప్డేట్స్ లేక ఫాన్స్ కూడా నిరాశ లో ఉన్నట్టు సమాచారం. కొరటాల దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణరామ్ సమర్పకుడిగా, ఇంకా  మిక్కిలినేని సుధాకర్ యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

అలియాభట్ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ అన్న వార్తలు వినిపించయ్ కానీ ఇపుడు పెళ్లి కారణంగా సినిమా వదులుకుందట. ఈ సినిమాని జూన్ లో పట్టాలెక్కించాలని చూస్తున్నారు. జూన్ కి ఇంకా రెండు నెలల సమయం ఉండటం తో ఎన్టీఆర్ మేక్ ఓవర్ మీద దృష్టిపెట్టాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం రఫ్ లుక్ లో వున్నా ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 8కేజీలు తగ్గి లుక్ చేంజ్ చేసుకోవాలని చూస్తున్నారు. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఒక ట్రైనర్ ని పెట్టుకొని మరి న్యూ లుక్ లో మారినట్టు సమాచారం. బరువు తగ్గి మీసం గడ్డం తో టెర్రీఫిక్ లుక్ లో వున్న ఫోటో లు నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ తన ట్రైనర్ తో వున్న న్యూ లుక్ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఫోటో చుసిన అభిమానులు ఎన్టీఆర్ న్యూ లుక్ చూసి వావ్ అంటున్నారు.