NTR: కొరటాల శివ తో సినిమా గురించి న్యూ అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్..!

NTR: మూడేళ్లుగా ఎదురుచూస్తున్న జక్కన్న సినిమా ఆర్ఆర్ఆర్ విడుదలయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించాడు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించారు. ఇక ఎన్టీఆర్ నటన విషయానికి వస్తే ఈ సినిమాలో ఎన్టీఆర్ అబ్బురపరిచే నటనతో అందరిని ఫిదా చేశారు. మరీ ముఖ్యంగా కొమరం భీముడు సాంగ్ లో ఎన్టీఆర్ నటనకు అభిమానులు నీరాజనం పలుకుతున్నారు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా విడుదలైన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమా విజయం తర్వాత ఎన్టీఆర్ ఒక మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా విజయం గురించి ముచ్చటించారు. ఇంటర్వ్యూ లో భాగంగా భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి ప్రశ్నలు రాగా.. నా 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నానని జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలియజేశారు. సినిమా ప్రస్తుతం సినిమా కోసం తన లుక్ మార్చుకునే పనిలో ఉన్నానని తెలియజేశారు.

ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయ్యిందని, అంతేకాకుండా ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుందని తెలియజేశారు. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తుండగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు అట. ఒక పూర్తి యాక్షన్ చిత్రంగా ఈ సినిమాని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించ పోతున్నారట. అంతేకాకుండా వచ్చే సంవత్సరం ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు కూడా మీడియా సమావేశంలో తెలియజేశారు. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత కొరటాల శివతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.