బిగ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ మిస్సయిన ఎన్టీయార్.!

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. అంతర్జాతీయ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనం కొనసాగుతూనే వుంది. మొత్తంగా నాలుగు కేటగిరీల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి అవార్డులు దక్కాయి. బెస్ట్ యాక్షన్, బెస్ట్ సాంగ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలింస్ కేటగిరీల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి పురస్కారాలు దక్కగా, అవార్డుల ప్రెజెంటర్‌గా కూడా చరణ్ ఈ వేదికపై కనిపించడం గమనార్హం.

ఈ క్రమంలో ‘ఇంటర్నేషనల్ సూపర్ స్టార్’ అంటూ రామ్ చరణ్‌ని పలువురు హాలీవుడ్ ప్రముఖులు కొనియాడారు. వేదికపై రాజమౌళి, రామ్ చరణ్ సందడి చేశారు. కానీ, యంగ్ టైగర్ ఎన్టీయార్ ఈ వేదికను మిస్ అయ్యాడు.

దాంతో, అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. రామ్ చరణ్‌తోపాటు ఎన్టీయార్ కూడా ‘ఇంటర్నేషనల్ సూపర్ స్టార్’ అనే గుర్తింపుని ఈ వేదిక ద్వారా సంపాదించే అవకాశం వుండేది.. ఈ కార్యక్రమంలో ఎన్టీయార్ పాల్గొని వుంటే. కొరటాల శివతో సినిమా పనులే, ఎన్టీయార్ అమెరికా వెళ్ళలేకపోవడానికి కారణమా.? ఇంకేవైనా వ్యక్తిగత కారణాలున్నాయా.?