ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా మొదలవ్వడానికి చాలా టైమ్ తీసుకుంది. ఆకాశమే హద్దు అన్నట్లుగా మార్చేశాయి. ’దేవర’ టైటిల్‌తో పాటు వదిలిన గ్లింప్స్‌తో ఫ్యాన్స్ ఆనందానికి అవధులే లేవంటే నమ్మాలి.దేవర’ సినిమా రావడానికి కాస్త టైమ్ పట్టే అవకాశం ఉండటంతో.. అభిమానులకు మాత్రం ఎన్టీఆర్ మధ్యమధ్యలో ట్రీట్ ఇస్తూనే ఉన్నాడు.
రీసెంట్‌గా బాలీవుడ్ సినిమా ’వార్ 2’ ఎన్టీఆర్ చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. దీనితో పాటు ఎన్టీఆర్ చేస్తున్న యాడ్స్‌కి సంబంధించిన లుక్స్.. ఇలా ఏదో రకంగా ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా యంగ్ టైగర్ ఓ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ఈ షూట్‌కు సంబంధించి ఎన్టీఆర్ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఓ పిక్‌ని సోషల్ విూడియా వేదికగా షేర్ చేశారు. ఈ పిక్‌లో తారక్‌ని చూసిన వారంతా.. ’కిర్రాక్‌గా ఉన్నాడు.. లుక్ అదిరిపోయింది.
ఏమున్నాడ్రా బాబు..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ముందు తారక్ లీషియస్, యాపీ ఫిజ్, మెక్ డొనాల్డ్స్ వంటి యాడ్స్ కోసం చేసిన షూట్ ఫిక్స్ వైరల్ కాగా.. ఇప్పుడీ షూట్ ఏ బ్రాండ్ కోసం అనేది తెలియలేదు కానీ.. ఇందులో మాత్రం చాలా స్టైలిష్‌గా ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఆయనని అలా తయారు చేశారు. గుబురు గడ్డం, కళ్ళకి గ్లాసెస్‌తో ఎన్టీఆర్ కూర్చున్న తీరు చూస్తుంటే.. టైగర్ (ªుతిణ।స) తీక్షణంగా చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. మొత్తంగా అయితే.. ఎన్టీఆర్ ఈ లుక్‌తో కిల్ చేశాడని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మాధ్యమాలలో వైరల్‌గా అవుతోంది.