NTR @30: కొరటాల, ఎన్టీఆర్ సినిమా నుండి కొత్త అప్ డేట్….!

NTR @ 30 : ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దాదాపుగా నాలుగు సంవత్సరాలు ఎన్టీఆర్ కేటాయించారు. గత మూడేళ్లుగా ఎన్టీఆర్ సినిమా తెరపై రాలేదు ఇక ఆ కరువంత ఆర్ఆర్ఆర్ తో తీరుతుందని అభిమానులు అనుకున్న సినిమాలో ఎన్టీఆర్ నిడివి తక్కువ ఉండడంతో నిరాశ పడ్డారు.ఇక ఇపుడు కొరటాల సినిమాపై ఆశలు పెట్టుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమా షూటింగ్ జూన్ లో మొదలవుతుందని అనుకుంటున్నారు.

ఇక ఈ సినిమా కోసం తొలుత ఆలియా భట్ ను హీరోయిన్ గా అనుకున్న తాను సినిమానుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇపుడు జాన్వీ కపూర్ కానీ దిశా పఠాణి కానీ హీరోయిన్ గా అనుకుంటున్నారట. కానీ ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం తెలీదు. ఇక సినిమా స్క్రిప్ట్ పని మొదలయిందని కొరటాల స్వయంగా చెప్పడంతో ఇక సినిమా షూటింగ్ మొదలుపెడతారని భావిస్తునారు.

ఇక ఆచార్య సినిమా కోసం బిజీగా ఉన్న కొరటాల అది అవ్వగానే ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు జూన్ లో షురు చేసే అవకాశాలు ఉన్నట్లుగా గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎక్కువ సమయం తీసుకోకుండా ఎన్టీఆర్ 30 సినిమాను ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ 30 ని సుధాకర్ మరియు కళ్యాణ్ రామ్ లు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా రూపొందించనున్నట్టు తెలుస్తుంది.