ఆ సినిమాలో నటించి ఇప్పటికీ బాధపడుతున్న ఎన్టీఆర్.. ఆ సినిమా ఏదంటే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలకు హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలు రావడం సర్వసాధారణం. అయితే హీరోలు ఫ్లాప్ సినిమాలను కూడా పాజిటివ్గా తీసుకొని తదుపరి సినిమాలపై పూర్తి దృష్టి సారించి ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్ సైతం తన కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయని చెప్పాలి.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కెరియర్ లో నటించిన ఒక సినిమా విషయంలో మాత్రం ఇప్పటికీ ఈయన ఎంతో బాధపడుతుంటారని తెలుస్తోంది.

రాజమౌళి దశకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా ఇండస్ట్రీలో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ అనంతరం ఇండస్ట్రీలో వెనుతిరిగి చూసుకోలేదు. ఇక ఈయన తన కెరీర్లో రాజమౌళి, పూరి జగన్నాథ్, వివి వినాయక్ వంటి బడా హీరోల దర్శకత్వంలోనే సినిమాలు చేశారు. ఇకపోతే ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా ఆంధ్రావాలా గురించి ఎన్టీఆర్ ఇప్పటికి బాధపడుతుంటారని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించినందుకు ఎన్టీఆర్ ఎందుకు ఈ సినిమాలో నటించానా అని బాధపడుతుంటారట.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి డిజాస్టర్ ఎదుర్కొందం మనకు తెలిసిందే.ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ అభిమానుల సైతం అసలు తారక్ ఈ సినిమాని ఎలా చూస్ చేసుకున్నారనే ప్రశ్న కూడా తలెత్తింది. ఇక ఈ విషయం గురించి పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు ఆంధ్రవాలా కథ ఎన్టీఆర్ కి ఏమాత్రం సెట్ అయ్యే కథ కాదంటూ స్వయంగా ఒప్పుకున్నారు. ఈ విధంగా ఎన్టీఆర్ నటించిన ఆంధ్రవాలా సినిమాలు ఇప్పటికీ ఈయన ఎంతో రీ గ్రేట్ గా ఫీల్ అవుతూనే ఉంటారట. ఇక ఎన్టీఆర్ తాజాగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో మంచి హిట్ కొట్టారు. ఇక తన తదుపరి సినిమాల విషయానికొస్తే ఈయన కొరటాల శివ అనంతరం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ కానున్నారు.